ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఇశ్రాయేలీయులు తమ అరణ్య సంచారంలో ఉన్నట్లుగా, నేను ఈ లోకం గుండా వెళుతున్నప్పుడు, రాత్రిపూట అగ్ని స్థంభం మరియు పగటిపూట మేఘం నన్ను నడిపించడానికి నేను కొన్నిసార్లు చాలా ఆశపడతాను. కానీ దేవుని ఆత్మ యొక్క స్థిరమైన ప్రత్యక్షత మరియు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టననిన వాగ్దానము నాకు జ్ఞాపకము చేయబడుతుంది. నేను అతని మహిమను వెతికితే , నేను తన చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన చోటకు అతను నన్ను తీసుకొని వెళ్తాడని మరియు ఈ జీవితంలో మరియు రానున్న జీవితంలో నాకు అత్యంత ప్రయోజనం కలిగించే మార్గాల్లో నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను.

నా ప్రార్థన

ఓ పరలోకపు తండ్రీ, నేను ఉండాలనుకుంటున్న ప్రదేశాలకు, నేను సేవ చేయాలని మీరు కోరుకునే పరిచర్య విభాగాలకు మరియు నేను తాకాలని మీరు కోరుకునే వ్యక్తులకు వద్దకు నన్ను నడిపించండి. నీ పనిని చేయడానికి నా హృదయాన్ని స్వాధీనపరచుకోండి మరియు మీ రాబోయే కీర్తిని ఎన్నడూ కోల్పోనివ్వకుడి . యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు