ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనలో కొందరు దేనికోసం తమ వేగాన్ని తగ్గించుకోరు ! దేని కోసమైనా సరే .మనం "మన ఆలోచనలతో చాలా నిండుగా" ఉండి, మన స్వంత ప్రణాళికల్లో చిక్కుకున్నప్పుడు, మన గొర్రెల కాపరి అయిన యెహోవా మనల్ని నిదానించేలాచేస్తాడు మరియు మనల్ని విశ్రమించేలా చేస్తాడు. మనకు విశ్రాంతి, పోషణ మరియు సేదతీరూట అవసరమని మన గొర్రెల కాపరికి తెలుసు మరియు అవును మరియు కొన్నిసార్లు మనల్ని "పచ్చని పచ్చిక బయళ్ళు" మరియు "నిశ్చల జలాలను" కనుగొనేలా చేస్తాడు . ఒకసారి మనం విశ్రాంతి మరియు సేదతీరినతరువాత ఆయన తన నీతి మరియు పవిత్రత వైపు మనల్ని నడిపిస్తాడు. మన జీవితం కోసం దేవుని ఆదేశం ఎల్లప్పుడూ దయ మరియు తరువాత మహిమకరము అని గ్రహించడము ఆసక్తికరంగా ఉంది కదా!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, వొళ్ళుమరచిన స్థితిలో వేగముగా వున్న నా జీవితాన్ని నెమ్మదింపజేసినందుకు మరియు నన్ను సేదతీరునట్లు చేసి , విశ్రాంతి మరియు పోషణ లభించు సమయాలకు నడిపించినందుకు ధన్యవాదాలు. మీ నీతిమంతమైన స్వభావం మరింత ఎక్కువగా ఉండేలా మీరు నన్ను పరిపక్వత చెందిస్తు నాకు అవసరమైన దాని కోసం మీరు నన్ను నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మీ స్వరము వినడానికి మరియు మీ దయకు ప్రతిస్పందించడానికి చాలా బిజీగా ఉన్నందుకు దయచేసి నన్ను క్షమించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు