ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శక్తిలేని వ్యక్తులను ,వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారిని, లేదా రాజీపడే పరిస్థితుల్లో ఉన్నవారి బలహీనతలను అవకాశముగా తీసుకునేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. పేదలు,బలహీనులు, పేదలు లేదా వెనుకబడినవారిని దోపిడీ చేసేవారు దేవుడు వారి చర్యలను చూస్తారని మరియు వాటికి లెక్క చెప్పాలని తెలుసుకోవాలి. దుఃఖంలో ఉన్న వారు దేవునిపై విశ్వాసం ఉంచాలి, దేవుడు చూస్తాడు, పట్టించుకుంటాడు, సరైన సమయంలో అతని సహాయాన్ని పంపుతాడు. మనలో ఎవరము కూడా పైన చెప్పినవారిలో లేనిచో , వారు ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటున్న వారి విమోచన మరియు ఆశీర్వాదం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.

నా ప్రార్థన

దయగల దేవా, దయచేసి నిజమైన బాధ మరియు హృదయ విధారక సమయాల్లో ఉన్న నాకు తెలిసిన చాలా మందిని ఆశీర్వదించండి. దయచేసి వారికి పరిచర్య చేయడానికి నన్ను ఉపయోగించండి. అయితే, ప్రియమైన తండ్రీ, వారిని మీ ఆత్మతో నింపండి, తద్వారా వారు శ్రమలను భరించడానికి అవసరమైన బలం మరియు ధైర్యం వారికి ఉంటుంది. మీ విమోచనతో వారిని ఆశీర్వదించండి, తద్వారా అందరూ మీ దయను తెలుసుకొని మీకు మహిమను చెల్లిస్తారు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు