ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ జీవితంపై దేవునిని ప్రభువుగా మరియు మీ దైనందిక జీవితంలో ఆయన కోరే నీతిని వెతకండి - విడిచిపెట్టకుండా దానిని కొనసాగించండి. మీరు అనుసరించే ఇతర అంశాలు అన్నీ తాత్కాలికమే. దేవుడు మరియు ఆయన రాజ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెంబడించే ప్రక్రియలో, తన రాజ్యాన్ని మరియు నీతిని మీకు ఇచ్చే దేవుడు, ఈ జీవితంలో మీకు అవసరమైన వాటిని కూడా మీకు అనుగ్రహిస్తారని మీరు కనుగొంటారు.

నా ప్రార్థన

పరిశుద్ధ ప్రభువా, నీలో మాత్రమే నా ఆత్మ కోరికలను తీర్చేదాన్ని నేను కనుగొంటాను. నా దృష్టిని ఆకర్షించిన విషయాలు కొద్దిసేపటికే విసుగు తెప్పిస్తాయి. నేను అనుసరించిన కృత్రిమ విషయాలు, నా వ్యసనపరమైన కోరికలు అన్నీ నన్ను ఖాళీగా మరియు బానిసలుగా మిగిల్చాయి. నేను మీలో మాత్రమే ఆశ మరియు సహాయాన్ని పొందుతున్నాను. దయచేసి నన్ను మీ ప్రేమకు దగ్గరగా ఉండనివ్వండి , సరిదిద్దండి, క్రమశిక్షణతో, నడిపించండి మరియు మీ మహిమకు నన్ను మలచండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు