ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మా స్వశక్తిలో ప్రగల్భాలు పలకడానికి మనకు ఆధారమంటూ లేదు. మన జీవితాన్ని మనం కాపాడుకోలేము. మనము రాజ్యాలను పడగొట్టలేము. మనము పరలోకము యొక్క అంచుని చూడలేము. మనము భవిష్యత్తును నిర్ణయించలేము లేదా గతాన్ని మార్చలేము. కాబట్టి మనం ప్రగల్భాలు పలకడానికి మన దగ్గర ఏమి ఉంది? దేవుడు! మనము అతని దయ మరియు కృపకు సజీవ సాక్ష్యంగా ఉన్నాము - మనకు అర్హత లేనప్పుడు అతను మనలను రక్షించాడు, మన ప్రాణాలను కాపాడే శక్తి లేనప్పుడు అతను పాపం మరియు మరణం నుండి మనలను రక్షించాడు. దుఃఖం , విచ్ఛిన్నం మరియు రాత్రి యందు ఉన్నవారు మనలను చూసి ఆనందించవచ్చు, ఎందుకంటే , దేవుడు పాపాత్ముడిని రక్షిస్తాడు, నిరుత్సాహపడువాడిని , విరిగినవారిని బాగు చేస్తాడు అనడానికి మనం సజీవ సాక్ష్యంగా ఉన్నాము. ఆయన మహిమ కొరకు యెహోవాను స్తుతించండి. ఆయన కృపకు యెహోవాను స్తుతించండి.

నా ప్రార్థన

తండ్రీ, ధన్యవాదాలు! మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. నాలోని మీ పనిని ఇతరులు చూడనివ్వండి మరియు మీరు వారిలో గొప్ప పని చేయగలరని అర్థం చేసుకొనగలుగునట్లు చేయండి. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు