ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం ఒంటరిగా పాడటం మంచిది కాదా, దేవుడు మన పాటలను ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం మంచిది కాదా! పరిశుద్ధాత్మ మనల్ని నింపుతుందని మరియు ఈ స్తుతిలో మనతో చేరుతుందని తెలుసుకుని, మనం ఇతరులతో కలిసి స్తుతి పాటలలో పాల్గొనడం మరియు ఆశ్చర్యం, ప్రేమ మరియు ఆనందంలో మనల్ని మనం కోల్పోవడం ఇంకా మంచిది కాదా (ఎఫెసీయులు 5:17-21). ఈ రోజు మనం ఇతర విశ్వాసులను కనుగొని, కలిసి దేవుణ్ణి స్తుతించడంలో గడుపుతాము. ప్రపంచవ్యాప్తంగా మరియు లక్షలాది మంది బలంగా ఉన్నారు, "ఈనాటి వచనం" అను కుటుంబంగా ఇతర విశ్వాసులను చేరుకుందాం మరియు ప్రభువును మహిమపరచడంలో మనతో చేరమని వారిని అడుగుదాం! * మా వెర్స్ ఆఫ్ ది డే కుటుంబం(ఈనాటి వచనం) అనునది 190 కి పైగా దేశాల నుండి 15 భాషలలో, మరియు దాదాపు 300,000 మంది రోజువారీ పాల్గొనే వారితో కూడి ఉంది, కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి స్తుతిద్దాం మరియు మనతో చేరమని ఇతరులను ఆహ్వానిద్దాం!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడు మరియు దయగల దేవా , దయచేసి నా ప్రశంసలు మరియు మీకు కీర్తి తెచ్చేలా ఇతరులతో కలవడానికి నేను చేసిన ప్రయత్నాలకు సంతోషించండి. పాపాలు, పొరపాట్లు మరియు త్రొటిల్లుటలో నన్ను క్షమించు. మీ అద్భుతమైన కృపకు సజీవ సాక్షిగా నన్ను శక్తివంతం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు