ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుని సేవకునిగా , ప్రజల జీవితాలలో చాలా ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరుకావడానికి నాకు అవకాశం లభించేది . మంచి లేదా చెడుకు , జీవితం యొక్క ప్రతి మూలమలుపులలో మనము ఇతరులకు అందుబాటులో ఉంటము అనేది మనము వారికీ కలిగించే ఒక పవిత్రమైన నమ్మకము . కష్టతరమైన, మరణిస్తున్న మరియు మరణించే ఆ క్షణాల్లో, ఇలాంటి వాక్యభాగాలు నా హృదయానికి బలాన్ని నింపుతాయి మరియు నా తలను ముంచివేసేంతగా నీరు వున్న మార్గము వంటి ఈ సేవ చేయాలన్న పిలుపుకు నేను ఎందుకు సమాధానం చెప్పానో నాకు గుర్తు చేస్తుంది. అతను తన ప్రజలను ఐగుప్తు నుండి విమోచించడము ప్రారభించినప్పుడు అతను ఎదైతే ప్రారంభించినాడో , అది వాగ్దాన దేశంలోకి తీసుకురావడం ద్వారా పూర్తి చేస్తాడని ఇక్కడ దేవుని వాగ్దానం గొప్ప జ్ఞాపికలా వుంది . ఇప్పుడు, ఈ పదాల వెనుక మరింత శక్తివంతమైన వాగ్దానం మనం వినవచ్చు. మనము వాటిని విశ్వసించడం మరింత సహేతుకమైనది. దేవుడు ఇశ్రాయేలు కోసం చెప్పినట్లు చేశాడు. అతను వారి కోసం చేసినందున, "మీ పవిత్ర నివాసానికి అనగా పరలోకానికి మీరు మాకు మార్గనిర్దేశం చేస్తారని నాకు తెలుసు" అని మనము నమ్మకంగా చెప్పలేమా ?.

నా ప్రార్థన

సాత్వికుడవైన కాపరి ,మీరు నన్ను చాలా కష్ట సమయాల్లో నడిపించారు మరియు నన్ను సురక్షితంగా తీసుకువచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం జీవించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దయచేసి మీ ఉనికిని తెలియజేయండి. మీ పవిత్ర నివాసానికి మీరు నన్ను నడిపిస్తున్నారని నేను నిజంగా నమ్ముతున్నాను, కాని కొన్నిసార్లు, మార్గం కష్టమవుతుంది మరియు విశ్వాసం కష్టమవుతుంది అని నేను అంగీకరించాలి. యెహోవా, మీరు అయిష్టంగా ఉన్న మోషేతో మరియు పరీక్షించని జాషువాతో చేసినట్లే నా ధైర్యాన్ని పునరుద్ధరించండి. అప్పుడు, ప్రియమైన ప్రభూ, దయచేసి మీ వాగ్దానాన్ని మరియు మీ ఇంటికి వెళ్ళే మార్గాన్ని కనుగొనడంలో ఇతరులకు సహాయపడటానికి నన్ను ఉపయోగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు