ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సంగతుల యొక్క గొప్ప పథకంలో మన పాత్ర ఏమిటి? 21 వ కీర్తనలో, దేవుని "చీర్లీడర్లు"గా (క్రీడలలో సందడి చేయు వారు )మన ప్రాముఖ్యతను ఆత్మ నొక్కి చెబుతుంది. కీర్తితో తనను తాను బయలుపరచమని మేము దేవుడిని కోరుతున్నాము. తన బలాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని మేము దేవుని కోరుతున్నాము. ఆయన చేసిన గొప్ప పనులను చూసి మేము ఆశ్చర్యపోతున్నాము. దేవుడు మనకోసం చేసిన నమ్మశక్యం కాని పనులన్నిటికీ ఆయనను స్తుతిస్తాము.

నా ప్రార్థన

పరలోకములో ఉన్న ప్రియమైన తండ్రీ, అన్నిటికీ మించి మిమ్మల్ని మరియు మీ పేరును మహిమపరచుకొనండి. మీరు చేసిన అన్నిటికీ, మీరు చేస్తున్నదానికి మరియు భవిష్యత్తులో మీరు చేయబోయే అన్నిటికీ నేను దిన దిన మహిమను మరియు కృతజ్ఞతలు చెల్లించుటకొరకు నన్ను అంకితం చేస్తున్నాను. నిజమైన దేవా, ఆల్ఫా మరియు ఒమేగా, మీకు,నేను నా హృదయపూర్వక ప్రశంసలను మరియు నా సంతోష కీర్తనలను అందిస్తున్నాను. ప్రభువైన యేసు నామంలో, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు