ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పౌలు తన జీవితపు చివరి కాలములో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, అతను ప్రభువు వద్దకు నడిపించినవారిలో చాలామంది అతన్ని విడిచిపెట్టారు. కానీ ప్రభువు తనను విడిచిపెట్టడు అనే నమ్మకంతో ఉన్నాడు! అతను తన జీవితాన్ని యేసు ప్రభువుకు అంకితం చేశాడు. పౌలు చేసిన పెట్టుబడి వృథా కాకుండా ఆ ప్రభువు చూస్తాడు. అతని జీవితం, అతని భవిష్యత్తు మరియు అతని శాశ్వతమైన విధి ప్రభువుకు అప్పగించబడ్డాయి. వారు కూడా ప్రభువులో భద్రంగా ఉన్నారని ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవునికి మాత్రమే తెలిసిన ఒక ప్రత్యేక రోజున, యేసు తిరిగి వస్తాడు మరియు ప్రతి మోకాలు ఆయన నామమున వంగును, మరియు ప్రభువుపై పౌలు విశ్వాసం ఆనందంగా ధృవీకరించబడుతుందని అతను తన అణువణువునా నమ్మాడు.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నేను నమ్ముతున్నాను, కాని దయచేసి నా విశ్వాసాన్ని బలోపేతం చేసుకోండి, తద్వారా నేను ఏమి సహించినా, మీపై నా విశ్వాసం దృఢముగా ఉంటుంది మరియు నా ఆశ ఉత్సాహంగా ఉంటుంది. నేను ప్రస్తుతము వున్నా విధానాన్ని మరియు నేను ఉండాలని ఆశిస్తున్న అన్నిటినీ నేను మీకు అప్పగిస్తున్నాను, రానున్న ప్రతిదాని గుండా మీరు నన్ను నడిపిస్తారని మరియు గొప్ప ఆనందంతో నన్ను మీ మహిమాన్వితమైన సన్నిధిలోకి తీసుకువస్తారని పూర్తిగా నమ్ముతాను. యేసు మహిమాన్వితమైన నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు