ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆనందానికి నవ్వు మరియు పాట కంటే మెరుగైన వివరణ తెలియదు. మనం ఆనందంగా ఉన్నందున ప్రభువుకు పాడతాము! మా సంగీతం నిరోధించబడదు లేదా వెనుకకు ఉంచబడదు, కానీ హృదయపూర్వకంగా ఉల్లాసంగా మరియు ధ్వనితో నిండి ఉంది. థాంక్స్ గివింగ్ ( అమెరికా దేశం లో ఒక పండుగువంటిది ) మనలను తండ్రి సన్నిధికి తీసుకువస్తుంది మరియు రక్షించబడినందుకు మన ఆనందమే మనలను పాడటానికి దారి తీస్తుంది.

నా ప్రార్థన

ఓ అద్భుతమైన మరియు మహిమాన్వితమైన దేవా, పాపం, మరణం,ధర్మశాస్త్రము మరియు వ్యర్ధమైనదానినుండి నన్ను రక్షించినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను రక్షించినందుకు మరియు మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు, నేను ఉప్పొంగిన మరియు పొంగిపొర్లుతున్న ఆనందంతో మీ ముందుకు రాగలనను. మీ ప్రేమ మరియు దయ నాకు ఆశను ఇవ్వడమే కాకుండా నన్ను మీ బిడ్డగా మార్చాయి. నా హృదయాన్ని వినండి మరియు నా స్తుతి పాటల ద్వారా ఆశీర్వదించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను మరియు ఎప్పటికీ మరియు ఎప్పటికీ నీ మహిమను గూర్చి పాడుతాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు