ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సంఘము లేదా బహిరంగ సేవ కార్యక్రమాలలో మీరు చివరిసారిగా ఎప్పుడు దేవుణ్ణి స్తుతించారు? కీర్తనలను పాడుటకు నోరు తెరిచి, మీ స్వంత ప్రశంసలను మరియు దేవునికి కృతజ్ఞతలు ప్రతిబింబించే అనేక శ్లోకాలను కనుగొని, వాటికి ఒక స్వరము ఇచ్చి - అది కూడా మీ స్వంత స్వరము ఇచ్చి పాడుటకు ఎందుకు నోరు తేరువకూడదు ! మీ ఆధ్యాత్మిక బహుమతి సంగీతమా కాదా అని దేవుడు పట్టించుకోడు; అతను మీ ప్రశంసలను మరియు కృతజ్ఞతలను అతనితో పంచుకున్నప్పుడు అతను మీ హృదయాము ఆనందంతో నింపబడాలని చూస్తున్నాడు.

నా ప్రార్థన

దయగల తండ్రీ, ప్రతి మంచి మరియు పరిపూర్ణమైన బహుమతిని దయచేయువాడా , నా కృతజ్ఞతలు మరియు ప్రశంసలను ప్రత్యేక రోజులు మరియు ప్రత్యేక ప్రదేశాలకు చెందునట్లుగా చేసినందుకు నన్ను క్షమించు. మీ మానవ మాత్రులైన పిల్లలు మంచితనాన్ని జరిగించే సామర్థ్యం, మీ సృష్టిలో సంతోషించటానికి మరియు ప్రశంసలు మరియు కృతజ్ఞతలు తెలుపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నందుకు నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. మా అబ్బా తండ్రి మరియు సృష్టికర్తవైన మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మా ప్రపంచాన్ని చాలా కారణాలతో చేసినందుకు ధన్యవాదాలు. మీరు నిరంతరం నన్ను మీ ఆత్మతో నింపినప్పుడు, నా హృదయం మహిమ కీర్తనలతో మరియు కృతజ్ఞతలు తెలుపు మాటలతో పొంగిపోతుంది. యేసు పవిత్ర నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు