ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన పరిస్థితులను బట్టి మన మనోభావాలను నిర్ణయించనివ్వడం చాలా సులభం. క్రీస్తులో కొత్త జీవితం ప్రారభించిన వారు, వారు ఎదుర్కొంటున్న బాహ్య పరిస్థితులలో ఉన్నప్పటికీ వారికి ఆ జీవితం ఆనందం కలిగిస్తుందని పౌలు హింసకు గురి అవుతున్న క్రొత్త క్రైస్తవుల సమూహానికి గుర్తుచేస్తున్నాడు. వారి ఆనందం అశాశ్వితమైనది , పరిస్థితులు నిర్ణయించిన ￰పైపూత వంటి మాటలు కాదు కానీ వారు రక్షణ, శక్తివంతమైన సందేశాన్ని ఆనందంతో స్వాగతించారు! ఈ ఆనందం వారి పరిస్థితులపై ఆధారపడి లేదు. ఇది వారి రక్షకుడి కనపరుచు మాదిరిలో , పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నివాసస్థానంలో, మరియు యేసు ద్వారా లభించే రక్షణ.

నా ప్రార్థన

ప్రియమైన పరలోకపు తండ్రీ, దయచేసి నా ఆనందాన్ని బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండకుండా నిరోధించండి, మరియు దయచేసి మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆనందాన్ని శక్తివంతం చేయండి. నా జీవితాన్ని మరియు వైఖరిని నా రక్షకుడి కనపరచిన మాదిరికి అనుగుణంగా మార్చడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి నన్ను ఆశీర్వదించండి. నా చుట్టూ ఉన్నవారికి ఆధ్యాత్మిక ఆనందానికి నేను మంచి మాదిరిగా మారడానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు