ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రొత్త ప్రయాణం ప్రారంభంలో ప్రోత్సాహము కలిగించే పదం చాలా అవసరం, ముఖ్యంగా ప్రయాణం మీ నాయకత్వాన్ని కోరినప్పుడు అది చాల అవసరం. యెహోషువ ఇప్పుడు రెండవ నాయకుడు కాదు,అతను ఇకపై అన్నివిధాలా మోషేకు అనుకూలముగా నడుచువాడు కాదు. ఇప్పుడు అది అతని నాయకత్వపు వంతు. అతను నడిపించే ప్రజలకు సాటిలేని మోషే నాయకత్వం మాత్రమే తెలుసు. మరి ఇతను ఎలా నడిపిస్తాడు? ఇతను దేవుని వాగ్దానాలను విశ్వసించి, భయం లేదా నిరుత్సాహం లేకుండా నడిపిస్తాడు! ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే దేవుని ప్రజల నిజమైన నాయకుడు ఎప్పుడూ మారలేదు! దేవుడు ఇప్పటికీ దేవుడు. ఆయన మాట ఇప్పటికీ నిజం. ఆయన వాగ్దానాలు ఇప్పటికీ నమ్మదగినవి. అతని శక్తి లో ఇప్పటికీ సర్వశక్తిమంతుడు.

నా ప్రార్థన

దేవా, నేను పెరుగుతున్న బాధ్యతలు మరియు ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు, మీ వాగ్దానాలను నాకు గుర్తు చేయండి, నా భయాలను తొలగించండి, నా దృడ నిశ్చయాన్ని బలోపేతం చేయండి మరియు మీ ఇష్టంతో నన్ను నడిపించండి. నేను పొందే విజయాలు ఎల్లప్పుడూ మీకు మహిమను మరియు గౌరవాన్ని ఇస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు