ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రేమ నాపై దృష్టి పెట్టదు, ఇతరులపై దృష్టి పెడుతుంది . ప్రేమ యొక్క ఈ లక్షణాలలో ప్రతి ఒక్కటి ఆప్యాయత, కరుణ మరియు క్షమించే వైఖరిపై ఆధారపడి ఉంటుంది, అది ఇతరులను విలువైనవారిగా పరిగణించడమేగాని నాపై మరియు నా కోరికలపై మాత్రమే విలువను ఉంచడం కాదు. పాత సామెత "ది మిడిల్ ఆఫ్ సిన్ ఈజ్ ఎ బిగ్ ఐ!" (సిన్ అనే ఇంగ్లిష్ పాదములో మధ్య పదము I అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.)అనగా నేను ."నేను" అనే పదము ఇతరులకన్నా ముఖ్యమైనది మరియు "నేను" ఏమి కోరుకుంటున్నాను మరియు "నేను" గెలుపొందడం మరొకరికి నిజంగా అవసరమైన దానికంటే ముఖ్యమైనది అయినప్పుడు, "నేను" నా మార్గాన్ని కోల్పోతాను మరియు క్రీస్తు ప్రేమను ప్రదర్శించను.

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా మరియు త్యాగం చేసే తండ్రీ, ఇతరులను గమనించడం మరియు మీలాగే వారికి విలువ ఇవ్వడం నాకు నేర్పండి. నేను ప్రేమించబడనప్పుడు మీరు నన్ను ప్రేమించారని మరియు నేను అర్హుడను కానప్పుడు నన్ను విమోచించారని నాకు తెలుసు. నా కన్నులను నా నుండి తీసివేయడానికి మరియు ఇతరులను మీరు చూసే విధంగా చూడటానికి నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు