ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"ఆ సమావేశానికి నేను ఏమి ధరించాలి అని ఆశ్చర్యపోతున్నారా?" ఎల్లప్పుడూ ఒకే శైలిలో ఉండే దుస్తుల సమితి ఉందని పౌలు మనకు గుర్తుచేస్తాడు. మనము ఈ దుస్తులను ధరిస్తాము ఎందుకంటే మనము ప్రత్యేకంగా ఉంటాము. మంచి స్వభావము అనే ఈ దుస్తులు అత్యున్నతమైన నిర్మాణకుడు అని పిలువబడే అయన సేకరణ నుండి వచ్చాయి మరియు ఇతరలతో ఉన్నప్పుడు అవి ధరించడం ఉత్తమం. ఈ లక్షణాలను ధరించడం కష్టం, కానీ మనము ఈ గొప్ప దుస్తులతో అలంకరించబడినప్పుడు మనలను కలిసే వారికి ఎల్లప్పుడూ ఆశీర్వాదమే .

నా ప్రార్థన

అబ్బా తండ్రి , నన్ను మీ కుటుంబంలోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇతరులతో ప్రవర్తించే విధానంలో నిన్ను ఎప్పుడూ నిరాశపరచకూడదు. నా జీవితంలో నీ ఉనికికి మాత్రమే ఆపాదించబడే స్వభావ లక్షణాలను వారు నాలో చూడగలరు. నా ప్రభువైన యేసు నామంలో మీకు ఎప్పటికీ మహిమ మరియు గౌరవం. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు