ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఏ క్రైస్తవునికైనా ఇది ఎంత అందమైన ప్రార్ధన! స్వార్ధపూరితమైన లోకంలో మనం చేయగల మంచి చెడ్డల పట్ల శక్తివంతమైన ప్రభావం ఉందని గుర్తుచేయడం ఉత్తేజకరమైన విషయంకాదా? మన వేషధారణలో, తిరుగుబాటుకు సంబందించిన వినాశకరమైన ప్రభావం గురించి గుర్తుండే విషయం మాత్రమేగాక, మన వైఫల్యాలు రాజ్యవ్యాప్తికిను, యెహోవాను సేవించాలని, ఆయనను ఘనపరచాలని చూసే క్రీస్తు నందు సహోదరి సహోదరులను నాశనపరిచేవిగా ఉండకుండునట్లు కూడా ప్రార్థిద్దాము! 

నా ప్రార్థన

ఓ దయకలిగిన శక్తివంతమైన దేవా ! నేను పాపము చేయను . అలాచేయుట మీ మీద తిరుగుబాటు చేయుట అని అది నీ హృదయమును భంగ పరుస్తుంది అని నాకు తెలుసు. నేను పాపం చేయాలనుకోవడం లేదు, ఎందుకంటే అది నన్ను తగ్గిస్తుందని మరియు భవిష్యత్తులో దాడులతో మరింత హాని కలిగించగలదని నాకు తెలుసు. తండ్రీ, నిన్ను వెదుకువారు తోట్రిల్లుటకు కారణముగా ఉండకుండునట్లు నేను పాపం చేయాలని కోరుకోవడం లేదు దయచేసి నా పాపాలను క్షమించుము, కాని తండ్రీ, నన్ను బలపరచుము మరియు నా శోధన సమయములలో నేను తోట్రిల్లకుండునట్లు దయచేసి నాకు సహాయం చేయండి. శోధన, మరియు పాపమును జయించిన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు