ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తుఫాను సమయంలో యేసు తన శిష్యులకు నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు చెప్పిన విషయం మీకు గుర్తుందా? అతను అక్షరాలా వారితో, "భయపడవద్దు, నేను" అని చెప్పాడు. పవిత్రమైన మరియు అద్భుతమైన దేవుని కుమారుని సమక్షంలో, మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసులో మనకు దేవుని దయ మన భయం యొక్క అవసరాన్ని తీసివేస్తుంది ఎందుకంటే యేసు త్యాగం మనలను పవిత్రంగా, తప్పు లేకుండా, మరియు మనపై ఎటువంటి అభియోగాలు లేకుండా చేస్తుంది (కొలొస్సయులు 1: 21-22). మన స్పందన ఏంటి ? ప్రేమ కనపరుచుట ! మన తండ్రి ఆయన ఎవరో, ఆయన చేసిన దానికోసం, మనకోసం ఆయన చేసిన గొప్ప త్యాగం కోసం, మరియు అన్నింటికంటే, మనల్ని పవిత్రంగా చేసి, మన భయాన్ని పోగొట్టినందుకు మనం ప్రేమిద్దాము .

నా ప్రార్థన

పరలోకములో వున్నప్రియమైన తండ్రీ, మీరు పవిత్రులు, అద్భుతం మరియు మహిమాన్వితమైనవారు. నీ దయ లేకుండా నేను ఎప్పటికీ ఉండలేను, అయినప్పటికీ నీ కుమారుడైన యేసు బలి ద్వారా ఈ ఆశీర్వాదాలను ఇవ్వడానికి మీరు ఎంచుకున్నారు. ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు