ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఐగుప్తులో ఇశ్రాయేలీయుల దుస్థితిని దేవుడు చూసి మరియు సహాయం కొరకైన వారి మొరలను విన్నట్టుగానే , అతను ఇప్పటికీ చూస్తాడు మరియు నేడు కూడా వింటాడు. కానీ ఇప్పుడు, ఆయన కేవలం వినువాడు మాత్రమే కాదు అంతటా వున్నవాడు కూడా. ఆయన వినుచున్నాడు; తన కుమారుడు మరియు మన రక్షకుడైన యేసు యొక్క మధ్యవర్తిత్వం వలన ఆయన వింటాడు. యేసు ఇక్కడే ఉన్నాడు. యేసు మరణపు దెయ్యాన్ని, హింసను , ఎగతాళిని ,బాధను ఎదుర్కొన్నాడు. దేవుడు సహాయం కోసం మన రోదన వినుట మాత్రమే కాదు ఆయన మనతో వేదన అనుభవిస్తాడు కూడా అని యేసు యొక్క భావం. అందుకే అతను వచ్చాడు. దేవుడు మన పరిస్థుతులు ఎరుగును, శ్రద్ధచూపును , కావలసిన చర్యను తీసుకొనును , మరియు చివరికి మనలను రక్షిస్తాడు అని ఆయన మనకు హామీ ఇస్తున్నాడు.

నా ప్రార్థన

దేవా, తండ్రి మరియు రక్షకా, దయచేసి వేదన మరియు దుఃఖము కలిగి నమ్మశక్యంకాని భారము కలిగి ఉన్నవారితో ఉండండి. వీటిలో కొందరు నాకు తెలుసు మరియు వ్యక్తిగతంగా వారికొరకు ప్రార్థిస్తున్నాను. ఇతరులు గురించి నాకు తెలియదు కానీ వారి వేదన, మరియు దుఃఖపు దినములలో వారిని వారు నిలబెట్టుకోవటానికి మీ ఆదరణ , బలం మరియు దయ ఇంకనూ వారికి అవసరం. దయచేసి మీరు వారిపట్ల కలిగియున్న శ్రద్ధకు సంబందించిన స్పష్టమైన సాక్ష్యాలతో వారిని ఆశీర్వదించండి.యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు