ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీ హృదయం ఎక్కడ నివసిస్తుంది? ఈ వాక్య భాగములో ఉన్నది అదే. అది మనం మన హృదయాలతో ఎక్కువ సమయం గడిపే ప్రదేశానికి సంబంధించినది. దేవుడు మీ జీవితంలో నిరంతరం ఉన్నాడన్న అవగాహన ఉందా? అతను మీ సమస్త ఒడిదుడుకులలో కనిపించని కానీ ఎల్లప్పుడూ ఉండే సహచరుడా? లేదా అంతా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మనతో ఉన్నారా మరియు పనులు బిజీగా ఉన్నప్పుడు మనతో లేకుండా పోయారా ? లేదా అంతా బాగానే ఉందని మనం భావిస్తున్నామా ? మనం ఎప్పుడూ ఒంటరిగా లేమని తెలుసుకోవడం వల్ల ఆనందం వస్తుంది. ప్రార్థన అనేది మనకు, ఆత్మ ఆత్మతో, బిడ్డ అబ్బా అని పిలువబడే తండ్రితో దేవునితో మానవుడు నిరంతరం కొనసాగించే ఒక సంభాషణ . కృతజ్ఞత చెల్లించుట మరియు సంతోషం అనేవి బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆశీర్వదించబడ్డామని తెలియజేయు గొప్ప గురుతులు .

నా ప్రార్థన

గొప్పదైన మరియు నీతిమంతుడైన తండ్రీ, ఎల్లప్పుడూ నాకొరకు ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు మీ ఉనికి గురించి నాకు లోతైన ప్రశంసలు మరియు మరింత లోతైన అవగాహన కలిగించండి . దయతో నన్ను రక్షించడం ద్వారా మీరు నాకు ఇచ్చిన ఆనందాన్ని నా జీవితం ప్రతిబింబిస్తుంది. మరియు నా హృదయం ఎల్లప్పుడూ మీలో తన ఇంటిని కనుగొనును . నా రక్షకుడైన మరియు స్నేహితుడైన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు