ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన సంస్కృతిలో మనం గౌరవించే మరియు ఉన్నతీకరించే చాలా విషయాలు నిస్సారమైనవి మరియు తాత్కాలికమైనవి. అందమైన స్త్రీలో నిలిచిపోయేది ఆమె అందం లేదా కాంతి కాదు, ఆమె దైవభక్తి. మన సంఘలోని కుటుంబాలు మరియు మన భౌతిక కుటుంబాలు దైవభక్తిగల స్త్రీలకు విలువనిచ్చేలా చూసుకుందాం మరియు వారికి తగిన ప్రశంసలు అందజేద్దాం!

నా ప్రార్థన

పరిశుద్ధ దేవా, వ్యక్తులందరిలో మేము మీ స్వభావమును ప్రతిబింబించే గుణలక్షణములను గౌరవించునట్లు మాకు మంచి కళ్లను మరియు మరింత నమ్మకమైన హృదయాలను ప్రసాదించండి. మేము మా పిల్లలను పెంచుతున్నప్పుడు వారు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వారిలో సరైన విలువల భావాన్ని కలిగించేలా మమ్ములను ఆశీర్వదించండి. మరియు ప్రియమైన దేవా, దయచేసి మా సంఘములోని మహిళలలను వారి పరిశుద్ధ స్వభావమునుబట్టి గౌరవించి ప్రశంసించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్ధించుచున్నాము . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు