ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

దేవుడు నూతన పరచువాడు మరియు ఆశీర్వాదములు ఇచ్చు దేవుడు. మనలను నూతనపరచుట మరియు ఆశీర్వదించాలనే ఆయన కోరిక మన రక్షణతో మనలను కేవలము ఒకసారి మాత్రమే ఆశీర్వదించాలనే కోరిక కాదు. దేవుడు ప్రతిరోజూ మనలను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అతను తన ఆశీర్వాదాలను నమ్మకంగా కుమ్మరింపజేస్తున్నందున ప్రతి ఉదయం అతని ప్రేమ స్థిరమైనది మరియు కొత్తది ( విలాప 3:23 కూడా చూడండి ). కానీ మనకు కావలసినదాన్ని ఇవ్వడం కంటే, అతను మంచి విషయాలతో మనలను సంతృప్తిపరుస్తాడు. మనకు అవసరమైన వాటిని ఆయన మనకు తెస్తాడు మరియు మన శూన్యతను నిజముగా నింపబడుతుంది .

నా ప్రార్థన

అబ్బా తండ్రీ, సర్వశక్తిమంతుడైన దేవా, నీ శక్తి, ఘనత, కీర్తి, విశ్వాసం, దయ, జ్ఞానం మరియు దయలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. మీ రక్షణ తో, మీ పరిశుద్ధాత్మ యొక్క బహుమతితో , మీసంఘమనే కుటుంబం యొక్క ఆశీర్వాదంతో,మీతో కూడా పంచుకొనబోయే ఒక ఇంటిని గూర్చిన వాగ్దానం మరియు దిన దినము నూతనపరచబడుచున్న నీ యొక్క ఉనికి యొక్క రోజువారీ వాగ్దానాలతో నన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో ప్రార్ధించుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు