ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన పాపాలను ఒప్పుకోవడం అంటే, మన పాపాన్ని దేవుడు చూసే విధంగానే చూడడము - అనగా అయన వలే తిప్పికొట్టడం మరియు దానిని అసహ్యించుకోవడము .ఈ విధమైన ఒప్పుకోలు మన హృదయాలను పరలోకపు దయ యొక్క వరదకు తలుపులు తెరుస్తుంది (కీర్తన 51 చూడండి). కల్వరి వద్ద యేసు కొనియున్న పాపం నుండి తియ్యనైన విముక్తిని దేవుడు మనతో పంచుకుంటాడు; మన పాపాలు క్షమించబడటమే కాదు ,కానీ మనం శుద్ధి చేయబడ్డాము. మనము ఇకపై పాపులం కాదు మరియు ఆ పాపం యొక్క మరక కూడా తొలగించబడుతుంది. దేవుని పరిశుద్ధత దయ వల్ల మనం పరిశుభ్రంగా, పరిపూర్ణంగా, మచ్చ లేకుండా ఉన్నాము (కొలొ. 1: 21-22). ఇప్పుడు ఈ అద్భుతమైన బహుమతిని ప్రతిబింబించే విధంగా జీవించండి!

నా ప్రార్థన

తండ్రీ, నా పాపాలను నేను మీకు అంగీకరిస్తున్నాను! దయచేసి నన్ను క్షమించు ... (దయచేసి మీ పాపాలను దేవునికి ప్రత్యేకమైన మాటలలో చెప్పండి) మీతో నిజాయితీగా ఉండటానికి మరియు నా నిరాశ మరియు వాటి పట్ల నా దుః ఖాన్ని మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు. దయచేసి నా జీవితంలో వాటి శక్తి నుండి నన్ను విముక్తి చేయండి మరియు మీరు వాటిని క్షమించడమే కాదు, మీరు నన్ను స్వచ్ఛమైన మరియు పవిత్రంగా చేసారని నాకు నమ్మకమును ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు