ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
ఒక మంచి గొర్రెలకాపరి తన గొర్రెలు జీవిత పరీక్షలను ఎదుర్కొనువిధముగా సన్నాహాలు చేస్తాడు . ఏ గొఱ్ఱెలకాపరి కూడా తన గొర్రెలను మన సర్వోన్నతమైన గొర్రెల కాపరివలె సిద్ధపరచడు . తన సత్ క్రియలు చేయునట్లుగా వారిని సిద్ధపరచుటకొరకు మరియు క్రీస్తులో మన సహోదరి సహోదరుల జీవితాల్లో తన అధికారాన్ని వదులుకొనకుండునట్లు ప్రత్యేకముగా వారికొరకు దేవునికి ప్రార్ధన చేద్దాము.
నా ప్రార్థన
ఓ గొర్రెలకు గొప్ప కాపరి, మీ ప్రజల్లో మీ ఆత్మ శక్తిని విడుదల చేసి, మొదటి క్రైస్తవులు వారి కాలంలో చేసిన మాదిరిగానే మా కాలములో మేము కూడా గొప్ప పనులు చేసేలా మమ్ములను సన్నద్ధం చేయండి.సమస్తము నీ మహిమకొరకు చేయబడును గాక!నా వీరుడైన యేసు నామమున అడుగుచున్నాము ఆమెన్.