ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

శోధన అనేది పాత మార్గము (మనకొరకైన దేవుని చిత్తం) మరియు సాతాను అందించిన కొత్త మార్గముల మధ్య జరుగు ఒక ఎంపిక. కాబట్టి తరచుగా సాతాను యొక్క మార్గం ఆనందం, శ్రేయస్సు మరియు సాధనకు సత్వరమార్గముగా మనకు కనపడుతుంది . ఏదేమైనా, ఈ మార్గం మనలను దేవుని నుండి మరియు ఆయన మనకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదముల నుండి దూరం చేస్తుంది. యిర్మీయా దినములలో దేవుని మార్గాన్ని నిరాకరించి, "మేము అందులో నడుచుకొనము" అని చెప్పిన దేవుని ప్రజలవలె ఉండకూడదు. వారి ఎంపిక వలన వారు పొందిన ఫలితం వారి స్వంత విధ్వంసం

నా ప్రార్థన

ఓ ప్రియమైన తండ్రీ, సర్వశక్తిమంతుడైన దేవా, మీ మార్గం నుండి తిరిగినందుకు మరియు తేలికగా, ఆనందానికి మరింత త్వరగా నడిపించేదిగా కనిపించే మార్గాన్ని ఎంచుకున్నందుకు నన్ను క్షమించు. మీ పరిశుద్ధాత్మ ద్వారా, సాతాను యొక్క ప్రలోభాల ముఖభాగాలను చూసేందుకు మరియు చేదుగా ఉండబోవు వాటియొక్క తుది ఫలితాన్ని చూడటానికి నాకు సహాయపడండి. మీ మార్గం ఆనందం, శాంతి మరియు విశ్రాంతి మార్గం అని నాకు తెలుసు. దయచేసి నమ్మకంగా నడవడానికి నాకు ధైర్యం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు