ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

తండ్రి లేదా తల్లికి ఇంతకంటే మంచి లక్ష్యం ఏముంటుంది? మీకు మీ స్వంత పిల్లలు లేకపోయినా లేదా మీ "సొంత" పిల్లలు పెరిగినా, దేవుడు తన పిల్లలను మీ సంఘంలో మీకు ఇస్తాడు కాబట్టి మీరు వారికి ఏకైక పరలోకపు తండ్రిని ప్రేమించడం, గౌరవించడం మరియు ఘనపరచడం నేర్పించవచ్చు. శిష్యులను చేసేవారిని శిష్యులనుగా చేయమని యేసు మనలను పిలిచాడు (మత్తయి 28:18-20; 2 తిమోతి 2:1-2). అంటే మనం ప్రేమించేవారిలో యేసు యొక్క రూపాన్ని ఏర్పరచడాన్ని చూడడమే మన జీవిత లక్ష్యం అని మనకు తెలుసు (లూకా 6:40; గలతీయులు 4:9; కొలొస్సీ 1:28-29).

నా ప్రార్థన

ప్రేమగల తండ్రి , మీ పిల్లలకు బోదించుపనిలో ఉండునట్లు నన్ను దీవించండి,మరియు నేను వారికి భోదిస్తూ వారు నిన్ను ప్రేమించునట్లు ,గౌరవించునట్లు ఏకైక మరియు నిజమైన దేవుడవైన నీయందు భక్తిగలిగి జీవించునట్లు వారికి ఉపదేశించుటకు నా ప్రయత్నములను దీవించండి.యేసు నామములో నేను ఈ కృప మరియు సహాయము కొరకు అడుగుచున్నాము ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు