ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రతి దేశానికి చెందిన దేవుని ప్రజలందరూ పశ్చాత్తాపంతో తమను తాము తగ్గించుకొని, దేశాలకు తన పవిత్రతను వెల్లడి చేయమని దేవుడిని కోరితే ఏమి జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సొలొమోను ద్వారా ప్రభువు తన ప్రజలకు చేసిన ఈ వాగ్దానాన్ని నేను గుర్తుంచుకోకుండా ఉండలేను అదేమనగా: "నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును." -రెండవ దినవృత్తాంతములు 7:14

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన మరియు పవిత్రమైన దేవా, నా ద్వారా నా స్నేహితులకు మీ సాక్ష్యాన్ని దెబ్బతీసిన నా పాపాలను బట్టి నన్ను క్షమించండి. నా దేశం చేసిన పాపాలకు మరియు మేము మీ మార్గం నుండి ఎలా మారిపోయామో అందును బట్టి క్షమించండి. దయచేసి మమ్మల్ని క్షమించండి మరియు మా రోజులో, మీ పవిత్రతలో మిమ్మల్ని మీరు బయలుపరచడానికి శక్తివంతముగా కదలండి . క్రీస్తు యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు