ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

"మీ తండ్రి మరియు తల్లిని గౌరవించండి." మన జీవితాల కోసం దేవుని ప్రణాళికకు ఇది ప్రాథమికమైనది. దయగల దేవుని ఒడంబడికలో కుటుంబాలు నిర్మించబడినప్పుడు, పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత చూపుట నిజముగా పిల్లలకు ఒక వరం! పెద్దలుగా, మేము మా తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడుకుంటాము,మరియు మా పిల్లలు మాకు తగిన గౌరవం మరియు మర్యాద ఇచ్చినప్పుడు వారికి ముఖ్యమైన జీవిత పాఠాలను బోధిస్తాము. ఈ యుగంలో తల్లిదండ్రులకు భయపడట అనే విఛ్షయం తుడిచిపెట్టుకొని పోకుండా చూద్దాము . దేవునికి మహిమ కలుగు మార్గాల్లో మన తల్లిదండ్రులను గౌరవిద్దాము . (మీ తల్లిదండ్రులు భక్తిహీనమైన లేదా దుర్వినియోగపరచువారైతే, మీ భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక మద్దతు కోసం మీ సంఘ కుటుంబంలో పెద్దవారిని కనుగొనండి, అయితే సాధ్యమైనంతవరకు మీ శారీరక తల్లిదండ్రులతో నిజాయితీగా, గౌరవముగా మరియు చిత్తశుద్ధితో వ్యవహరించండి).

నా ప్రార్థన

ప్రేమగల తండ్రి మరియు శాశ్వతమైన దేవా, నా - శారీరక లేదా ఆధ్యాత్మిక తల్లిదండ్రులను బట్టి మీకు ధన్యవాదాలు. వారు మీ ఇంటికి చేరే మార్గమును కనుగొనడంలో వారికి ఏది అవసరమే దానితో వారిని దీవించండి . నా ప్రేమను, గౌరవాన్ని వారికి ఎలా చూపించాలో తెలుసుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. అన్నింటికంటే, తండ్రీ, దయచేసి నా ప్రేమ మరియు మీ నుండి నాకు లభించిన వ్యక్తిత్వమును చూడటానికి వారికి సహాయం చెయ్యండి. యేసు నామంలో ప్రార్ధించుచున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు