ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఆహా! సత్యము మరియు వాగ్దానం యొక్క అధిక శక్తితో కూడిన ఈ పదబంధాలు నమ్మశక్యం కాని సేకరణ.మనము తండ్రి నుండి యేసుకు ఇవ్వబడిన బహుమతి. దేవుని మహిమగల సన్నిధిలో మనం తనతో ఉండాలని యేసు కోరుకుంటున్నాడు . యేసు మనము తన మహిమను చూసి దానిని అనుభవించాలని కోరుకుంటున్నాడు . సృష్టికి ముందు నుండి యేసును తండ్రి ప్రేమించాడు. ఈ విషయాల గురించి ఆలోచించండి. అవి మనము ఆయనకు ఎంత ప్రాముఖ్యమైనవారమో శక్తివంతంగా బయలుపరచునట్లు కనపరచుమని దేవుడిని అడగండి. అతని పిల్లలలో ఒకరిగా మీరు దేవుని మహిమలో పంచుకునే రోజును కల కనండి ! (1 యోహాను 3: 1-3 పోల్చి చూడండి ) ఇప్పుడు, దేవుడు మనకొరకు కలిగియున్న దృక్పథం ఆధారంగా జీవిద్దాము .

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా మరియు అబ్బా తండ్రీ, నేను మరియు మీ ఇతర పిల్లలనూ కలిగి ఉన్న ప్రాపంచిక మరియు భూసంబంధ దృష్టిని బట్టి నన్ను క్షమించు. మీ ఆత్మ ద్వారా, యేసు శిష్యుల గురించి మరింత లోతైన ప్రశంసలను నాలో కదిలించండి మరియు మాలో ప్రతి ఒక్కరూ మీకు ఎంత విలువైనవారొ కనపరచండి . నా స్వంత లోపాలను నేను గుర్తించినప్పుడు మరియు మీ పవిత్రమైన సింహాసనం ముందు మేము పరిపూర్ణతతో ఐక్యంగా ఉన్న రోజు కోసం నేను ఎంతో సహనంతో, ఓపికగా , క్షమించి, నా క్రైస్తవ సోదర సోదరీమణుల లోపాలను గౌరవించటానికి దయచేసి నాకు అధికారం ఇవ్వండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు