ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పొడిభారటము అనేది అది ఆధ్యాత్మికముగాకానీ లేదా శారీరకముగాకానీ ఆత్మ విషయంలో అయితే విరుగుడికి కారణం అలాగే అన్ని జీవులకు ఇది ఒకరకముగా వాడిపోవటంవంటిది . ఈ రోజు మన హృదయాలలో పదిమందికి స్థానం కలిగించుదాము.దేవుడు రెండు పనులు చేస్తాడని ప్రార్ధన చేద్దాము : (1) కాలం కష్టంగా ఉన్న ప్రదేశాలలోని భూములపై వర్షం మరియు తాజాదనం తీసుకురావాలని మరియు ; (2) నిరుత్సాహపడిన మరియు వారి ఇబ్బందులు, సవాళ్లు, ప్రలోభాలు, నిరుత్సాహాలు మరియు వైఫల్యాలతో దాదాపు అన్ని వదులుకోవడానికి దగ్గరగా ఉన్న తన సేవకులందరినీ అతను ఉపశమన పరుస్తాడు.ఈ రోజు మన ప్రపంచంలో మరియు దేవుని ప్రజలలో ఉపశమనం మరియు పునరుజ్జీవనం ప్రారంభం కావాలని ప్రార్థిద్దాం!

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన ప్రభువా, మేము అడిగినవాటికంటే లేదా ఊహించువాటికంటే ఎక్కువ చేయగలదేవా !ఈ రోజు హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి, వాడిపోవునట్లుగా చేసేవాటినుండి మాకు ఉపశమనాన్ని కలిగించమని అడగడంలో మేము మా గొంతులను మరియు హృదయాలను ఏకము చేసుకుంటాము .మా ప్రపంచంలోని కరువుతో కూడిన ప్రాంతాలకు మీ వర్షాలను పంపండి. మరియు ప్రియమైన తండ్రీ, దయచేసి మా సంఘములలో మరియు మీకు సేవ చేసే వారి హృదయాలలో, మా ప్రపంచమంతా పునరుజ్జీవనాన్ని తీసుకురండి. మన ప్రభువు మరియు రాజైన యేసుక్రీస్తు పేరిట దీనిని కలిసి అడుగుచున్నాము . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు