ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రైస్తవులుగా, మనము క్షమ మరియు దయ యొక్క వాతావరణంలో జీవిస్తున్నాము. మనం ఇతరులను క్షమించేటప్పుడు, దేవుడు మనలను క్షమించిన నమ్మశక్యం కాని ఆ ఋణమే ఈ క్షమాపణకు యొక్క ఆధారం(మత్తయి 18). అదే సమయంలో, దేవుడు తన క్షమాపణను ఒకరి తరువాత ఒకరికి చేరి వాడుకలో ఉండాలని మరియు మన ద్వారా ఇతరులకు అందజేయడాన్ని చూస్తూ , అతను సంతోషంగా మనపై మరింత క్షమాపణను కురిపిస్తాడు. మనకు నిజమైన హాని జరిగినప్పుడు ఒకరిని క్షమించటం ఎంత కష్టమో, ఇప్పటివరకు దేవుడు మనకు చేసిన ఆ ఆశీర్వాదము యొక్క ఖర్చును అధిగమిస్తుందని మనం తెలుసుకోవాలని యేసు కోరుకుంటాడు!

నా ప్రార్థన

ప్రేమగల మరియు న్యాయమైన దేవా, మీ కుమారుడైన యేసు చేసిన ప్రాయశ్చిత్త బలి ద్వారా నన్ను శుభ్రపరిచి క్షమించినందుకు ధన్యవాదాలు. మీరు నన్ను క్షమించినట్లు ఇతరులను క్షమించమని నన్ను సవాలు చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రజలు క్షమించే సమాజంగా ఉండాలని కోరినందుకు ధన్యవాదాలు. క్షమించటం పట్ల మనకు అయిష్టత, నెమ్మదిగా వుండటము లేదా అనుమానం వచ్చిన ఆ స్థితిలో మమ్మల్ని క్షమించండి మరియు ముఖ్యంగా నన్ను క్షమించు. ____ కోసం మీరు ___ ను క్షమించమని నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను మరియు ఈ వ్యక్తిని మీ ప్రేమ మరియు దయతో ఆశీర్వదించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు నామంలో. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు