ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు చాలా ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవడం కష్టమేమి కాదు. మనము దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించాలని మరియు మన చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనలో తన స్వభామును గూర్చిన దేవుని కోరిక, ధర్మశాస్త్రాన్ని అధిగమించే మరియు దేవుని స్వభామును మన హృదయాలలోకి తీసుకువచ్చే ఈ రెండు గొప్ప సూత్రాలను గౌరవించడానికి మనలను ప్రేరేపింపచేయుచున్నది.

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవుడా మరియు పరలోకపు తండ్రీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అబ్రాహాము మరియు దావీదు వారసుడిగా మీ మెస్సీయను పంపడానికైన మీ ప్రణాళిక కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ కోసం నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా బలహీనమైన ప్రార్థనలను వినడానికైన దయతో నా ప్రార్ధనలు విన్నందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసును పంపినందుకు మరియు మీ సంఘాన్ని ప్రారంభించినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రియమైన దేవా , యేసు నామంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు