ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనకు అవసరమైన దయను పొందుటకు మనకు అర్హత లేదు! దేవుని క్షమాపణను ఊహించుకునే హక్కు కూడా మనకు లేదు! దైవిక విమోచనను ఆశించటానికి మనకు ఎటువంటి కారణం లేదు! కానీ యేసులో, దేవుడు తన అద్భుతమైన ప్రేమను ఔదార్యాన్ని మనకు చూపించాడు. మనము అతని దయ కోరకు ఆత్మవిశ్వాసంతో అడుగుదాము మరియు అతని దయ, క్షమ మరియు విమోచనను పొందవచ్చు - మనకు అర్హత ఉన్నందున కాదు, కానీ అతనిని బట్టి మరియు అతని అద్భుతమైన పేరు కొరకు మనకు ఇవ్వబడింది

నా ప్రార్థన

పవిత్రమైన మరియు అద్భుతమైన దేవా , నాకు నీ దయ మరియు క్షమ అవసరం. క్షణికావేశ గుణము నుండి నాకు మీ విముక్తి అవసరం. మీ శక్తి మరియు దయ లేకుండా, ఖచ్చితంగా నేను విఫలమవుతాను. మీరు నాకు ఇచ్చిన కృప మీకు మహిమను తెచ్చుగాక . మీరు నన్ను క్షమించే క్షమాపణ మిమ్మల్ని గౌరవించటానికి ఇతరులను మీ వద్దకు తీసుకువస్తుంది. క్షణికావేశము యొక్క వల నుండి మీరు నన్ను విడిపించుకోండి, అప్పుడు మీ పేరుకు కీర్తి లభిస్తుంది. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు