ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ఈ రోజు ప్రభువు నుండి మీకు స్పష్టమైన, సరళమైన, సూటిగా ￰వాక్కు కావాలా? జెకర్యా గ్రంధం అది మనకు ఇస్తుంది. మనం న్యాయంగా, కరుణతో, శ్రద్ధగా, పక్షపాతం లేకుండా, అవసరమైన వారి పట్ల మృదువుగా ఉండాలని, మరియు ఒకరికొకరు సందేహపడువారికి ప్రయోజనాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్లు ఆయన మనకు గుర్తుచేస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు ప్రజలతో వ్యవహరించినట్లుగా మనం ఒకరినొకరు చూసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే మనం దేవునితో సవ్యంగా ఉండి మరియు ప్రజలతో తప్పుగా ఉండలేము!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి నేను గ్రంథంలోని కష్టసాధ్యమైన వాక్యభాగాలతో చిక్కుకొని మరియు ఎలా జీవించాలనే దానిపై మీ స్పష్టమైన బోధను విస్మరించినందుకు నన్ను క్షమించండి . మీరు నాకు ఆజ్ఞాపించినట్లు జీవించడానికి దయచేసి ఈ వారం నాకు అవకాశం ఇవ్వండి. భవిష్యత్తులో, నా హృదయం చల్లగా ఉన్నప్పుడు లేదా ఇతరులకు నా ప్రతిస్పందన అది ఎలా ఉండాలో అలావుండనప్పుడు, నేను మీ కీర్తికి అనుగుణంగా జీవించడానికి దయచేసి మీ ఆత్మ ద్వారా ఈ విషయాన్నీ నా జ్ఞాపకము చేయండి . యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు