ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

క్రీస్తులో మన జీవితం ఎంతో ఆశీర్వాదం! ఆ ఆశీర్వాదాన్ని పంచుకోవడానికి కొత్త క్రైస్తవులను మన సహవాసములోనికి స్వాగతిస్తున్నాము. మనము వారి గత వైఫల్యాలను లేదా ప్రస్తుత పోరాటాలను పరిశీలించడానికి వారిని తీసుకురాలేదు, కానీ వారిని దేవుని కుటుంబం యొక్క ప్రేమలోకి తీసుకురావడానికి మన సహవాసములోనికి స్వాగతిస్తున్నాము. దేవుడు మనలను దయతో మరియు కృపతో స్వాగతించాడు. కొత్త క్రైస్తవులతో కూడా అలాగే చేద్దాం.

నా ప్రార్థన

తండ్రీ, దయచేసి క్రీస్తులోని నా సోదరులు మరియు సోదరీమణులతో, ముఖ్యంగా కొత్త క్రైస్తవులుగా ఉన్న వారితో నాకు మరింత అవగాహన మరియు సహనం కలిగించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు