ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

యేసు. యేసువా. ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన జాషువా. సాతాను మన జీవితాల్లో నిర్మించిన కోటలను కూల్చివేయడానికి మనకు సహాయం చేయడానికి మేరీ యొక్క బాలుడు, దేవుని కుమారుడు వస్తాడు. మన కలత చెందిన ఆత్మలకు శాంతిని మరియు నిరాశతో కూడిన మన రాత్రులకు ఆనందాన్ని తీసుకురావడానికి ఆయన వస్తాడు. ఆయన మనకు పరిచర్య చేసి, మనలను ఆశీర్వదించడమే కాకుండా, ఎవరూ చేయలేని పనిని చేయడానికి వస్తాడు: మన పాపాలు, ఆ ఆధ్యాత్మిక దోషాలు, తిరుగుబాట్లు, తప్పులు, అతిక్రమణలు మరియు పాపాల నుండి మనలను విడిపించడానికి వచ్చాడు. దేవుణ్ణి స్తుతించండి! నిజానికి మనం ఎన్నటికీ కాలేని అనగా అతని వంటి స్వచ్ఛమైన, పరిపూర్ణమైన మరియు పవిత్రమైన దేవుని పిల్లలుగా అవ్వడానికి మనము ఎన్నటికీ జయించలేనివాటిని జయించడానికి వచ్చిన ఒక విమోచకుడు. ( కొలొ. 1:21-23 కూడా చూడండి )

నా ప్రార్థన

తండ్రీ, యేసు మరియు పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇచ్చిన క్షమాపణ, శుద్ధీకరణ మరియు పరివర్తనకు ధన్యవాదాలు. క్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు