ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

సంవత్సరం ప్రారంభంలో నేను శ్రద్ధ వహించే వ్యక్తులకు కష్టకాలంగా ఉంది. బహుశా అది మీకు లేదా మీరు ఇష్టపడే వారికి అలా జరిగి ఉండవచ్చు. మీ కోసం మరియు వారి కోసం నా ప్రార్థన ఏమిటంటే, వారు దేవుని సన్నిధిలోని ఓదార్పును తెలుసుకోవాలని. "పాదముద్రలు" అను ప్రఖ్యాతిగాంచిన చిన్న కవిత అయినా, సుపరిచితమైన వాక్యభాగము "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు " అనేదైనా సరే,ఇరుకునందున్న ఆవేదనను ఎదిరించడానికి దేవుని యొక్క ప్రత్యక్షత చాలా ముఖ్యమైనది. ! ప్రభువు మనతో ఉండాలని కోరుకుంటాడు, ప్రత్యేకించి మనం ఒంటరిగా ఉన్న క్షణాలలో మనతో ఉండాలని కోరుకుంటాడు. సిలువపై ఒంటరిగా, ఆ వేదనను అనుభవించడం ద్వారా అతను మనకు ఇది చెప్పాడు.

నా ప్రార్థన

దేవా, మీరు అందనంత దూరాన ఉండి నాకు దేవుడుగా ఉండడానికి నిరాకరించినందుకు నేను కృతజ్ఞుడను. మీరు వచ్చి సమస్తము విడిచిపెట్టడం, మరియు ఒంటరిగా ఉండటం ఎలా ఉంటుందో గ్రహించారు కాబట్టి, నేను ఎప్పటికీ మీచేత విడిచిపెట్టబడనని నేను విశ్వసిస్తానని నాకు తెలుసు. దయచేసి ఈ రోజు నా జీవితంలో నాతో మీ ప్రత్యక్షత స్పష్టంగా తెలియజేయండి, యేసు ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు