ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నా అవసరాలు మరియు నా భద్రత గురించి మొదట ఆలోచించడం చాలా సులభం. నేను స్వార్థపూరితంగా ఉండకూడదనుకుంటున్నాను, కానీ నా సమయం యొక్క పెట్టుబడి గురించి నిర్ణయాలు తీసుకోవటానికి వచ్చినప్పుడు, నేను విషయాలు మాత్రమే నా దృష్టికోణంలో చూడటం చాలా సులభం. కానీ దేవుని ప్రజలతో "మనము" మరియు "మన " అనే దృక్పథం ముఖ్యమైనది, "నేను" మరియు "నాది " అనే దృక్పథం కాదు. ఇశ్రాయేలీయుల తూర్పు గోత్రాలు తమ వాగ్దాన దేశానికి చేరుకున్నాయి. కానీ వారు పోరాటం వదిలి సమస్త దేవుని ప్రజలు సురక్షితంగా వారి స్వదేశంలో చేరే వరకు అక్కడ స్థిరపడి ఉండిపోవాలని కాదు. అదే నేడు దేవుని రాజ్యంలో మనకు వర్తిస్తుంది. మనం మన అవసరాలను మాత్రమే కాదు, క్రీస్తులోని మన సహోదర సహోదరీల అవసరాలను కూడా చూడాలి.

నా ప్రార్థన

ప్రేమగల తండ్రి, దయచేసి నాకు మరింత దయగల మరియు ఉదారమైన హృదయాన్ని ఇవ్వండి, తద్వారా నేను ఈ రోజు క్రీస్తులో శ్రమపడుచున్న సహోదరుడు లేదా సహోదరికి మీ ప్రేమను మరింత బాగా ప్రదర్శించగలను. యేసు నామములో నేను ప్రార్దిచించుచున్నాను . ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు