ఈనాటి వచనమునుగూర్చిన తలంపు
బహుశా మీరు "క్రైస్తవులు ఇంకను పరిపూర్ణంగా లేరు కానీ కేవలం క్షమించబడ్డారు!" అను ఈ బంపర్ స్టిక్కర్ వంటిది లేదా ఇలాంటిదే చూసివుంటారు. ఒక కోణంలో ఇది ఖచ్చితంగా నిజం. కానీ, దేవుని దృక్కోణంలో, క్రైస్తవులు పరిపూర్ణులు. పౌలు కొలొస్సయులకు ఇచ్చే అద్భుతమైన సందేశం అది. యేసు త్యాగం వల్ల, దేవుడు మన లోపాలను చూడడు. క్రీస్తు పరిపూర్ణత ద్వారా ఆయన మనలను చూస్తాడు. ఈ భావనలను చూసి ఆశ్చర్యపోతారు! దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తాడో చూడండి మరియు కృతజ్ఞతలు చెప్పండి! యేసులో మనకు కలిగిన దేవుని కృపతో వినయంగా ఉండండి మరియు సంతోషించండి! పవిత్రమైనది, మచ్చ లేకుండా, మరియు నిందారహితమైనదిగా ఉండండి - "హల్లెలూయా!"
Thoughts on Today's Verse...
"Christians aren't perfect, just forgiven!" You've probably seen this bumper sticker or heard something similar. In one sense, this is true. But, from God's point of view, Christians ARE perfect. That's the incredible message Paul gave the Colossians. Because of Jesus' sacrifice, God does not see our imperfections. He sees us through Christ's perfection and perfect sacrifice for us. Hear Paul's words and marvel! Look at how God views you and give thanks! Be humbled by God's grace to us in Jesus, and rejoice! By grace, we are "holy in his sight, without blemish, and free from accusation"! There's nothing left for us to say but "Hallelujah!"
నా ప్రార్థన
తండ్రీ, నన్ను పరిశుద్ధపరిచే త్యాగం అందించినందుకు ధన్యవాదాలు. యేసు యొక్క పరిపూర్ణత మరియు అతని త్యాగం ద్వారా నా విలువను చూసినందుకు ధన్యవాదాలు. ప్రభువైన యేసు, పాపానికి నా రుణాన్ని తీర్చినందుకు మరియు మీ పరిపూర్ణతను నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితం, మరియు ప్రతిరోజూ, మీ దయ ద్వారా మీరు నాకు ఇచ్చిన పరిపూర్ణతను మరింత దగ్గరగా పోలి ఉండునుగాక. నా రక్షకుడైన యేసు పేరిట, నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
My Prayer...
Father, thank you for providing the sacrifice that makes me clean. Thank you for seeing my worth through the perfection of Jesus and his sacrifice. Thank you, Lord Jesus, for paying off my debt to sin and for sharing your perfection with me. May my life today and every day more closely resemble the perfection you have given me by your grace. In the name of my Savior Jesus, I pray. Amen.