ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రేమ! ప్రేమికుల దినోత్సవం వారంలో, ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రేమ యొక్క ప్రేరణ మరియు వ్యక్తీకరణ లేకుండా, అన్ని "క్రైస్తవ" కార్యకలాపాలు క్రైస్త్యము కంటేకూడా అవి ఎక్కువ ఒక "కార్యకలాపం" మాత్రమే . ప్రేమ అనేది ఇతరుల కోసం చేసే పనుల ద్వారా మన జీవితంలో క్రీస్తు పాత్ర మరియు ఉనికిని వ్యక్తీకరించడం. కాబట్టి భావొద్వేగేలా మధ్య చిక్కుకొనే ఈ వాలెంటైన్స్ డే యాత్రలో చిక్కుకొనకండి . మనలో చాలా మంది ప్రేమ యొక్క రోజువారీ మోతాదును మరచిపోతారు, తద్వారా రోజువారీ సంబంధాలలో తరచుగా కోల్పోతారు. సంవత్సరం పొడవునా ప్రేమగా ఉంటూ, మనల్ని మనం యేసు శిష్యులుగా చూపించుకుందాం. (చూడండి. యోహాను 13:34-35)

నా ప్రార్థన

ప్రేమగల పరలోకపు తండ్రీ, యేసులో మీ ప్రేమను ప్రదర్శించినందుకు చాలా ధన్యవాదాలు. నా చర్యల ద్వారా ఇతరులు మీ ప్రేమను తెలుసుకునేలా నిస్వార్థంగా, త్యాగపూరితంగా మరియు నిలకడగా - ఆయనలా ప్రేమించేందుకు నాకు సహాయం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు