ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము సిలువ గురించి ఆలోచించినప్పుడు, దానితో మనం ఎప్పుడూ అనుబంధించకూడని రెండు పదాలు వున్నవి అవి "విషాద ప్రమాదం". రెండు వేర్వేరు శక్తి ప్రవాహాలు సిలువ వద్ద కలుస్తాయని పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు. చెడు దాని మార్గాన్ని కలిగి ఉండి దేవుని కుమారుడిని సిలువకు తీసుకువచ్చింది. దేవుడు తన ప్రణాళికను కలిగి ఉన్నాడు మరియు మనలను విమోచించడానికి సిలువను అనుమతించాడు. సిలువ ప్రమాదమేమీ కాదు. మన అంతిమ ఓటమిగా నరకం ఉద్దేశించినది, దేవుడు మనకు విముక్తి మరియు విజయాన్ని తెచ్చేవాడు. అన్నిటికంటే ఉత్తమమైన మరియు చెత్త కలిసికొనివున్నాయి . ఈ యుద్ధంలో సిలువ అంతిమ సమాధానం కాదు; ఖాళీ సమాధి మరియు పునరుత్థానం చేయబడిన ప్రభువే అంతిమ సమాధానం. మనము ఈ కృప యొక్క విజయవంతమైన గ్రహీతలము , ఇంత కష్టతరమైన వెలను చెల్లించాము, మన గొప్ప విరోధి చేత ఇంత క్రూరంగా నడిపించబడుచున్నాము. అయినను మరణము పై యేసు విజయం ద్వారా భద్రపరచబడ్డాము.

నా ప్రార్థన

పవిత్రమైన దేవా, నా పాపములు క్షమించబడతాయని మరియు మీతో నా భవిష్యత్తు భద్రంగా ఉందని దాచివుంచిన ప్రణాళికను కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. ఆ ప్రణాళిక పని చేయడానికి ధర చెల్లించినందుకు ధన్యవాదాలు. నరకం యొక్క దుష్టత్వం మరియు దుర్మార్గుల పనిపై విజయం సాధించినందుకు ధన్యవాదాలు. నేను మీ కోసం మరియు మీరు నా కోసం చేసిన అన్నిటికీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు