ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మంచి సమయాలలోను, కష్టకాలాల్లో, కలిగియున్న సమయములలోను, మరియు లేమి కలిగిన సమయాలలోను యెహోవా కృప తనకు తగినంత ఉందని కనుగొన్నాను అని ఆయన వారికి నొక్కిచెప్పిన తర్వాతే పౌలు ఫిలిప్పీయులకు ఈ వాగ్దానాన్ని చెప్పాడు, ఈ వాగ్దానానికి కీలకం కేవలము దేవుని సమకూర్పు మాత్రమే కాదు, క్రీస్తుయేసునందు మనకు అత్యంత అవసరతలను తీర్చుకోగలమని ఆయనపై మనకున్న నమ్మకం కూడా ఉంది.మన హృదయాలు ఆయనను గూర్చిన ఆలోచనలతో పూర్తిగా నిండినప్పుడు , ఆయనకు ఇష్టమైనట్లుగా వుంటూ, ఆయన ప్రత్యక్షత ద్వారా ఆశీర్వదించబడుతున్నప్పుడు, మరణమును దాటి జీవమును గూర్చిన హామీని పొందుతూ,మనం నిజముగా మనకు అవసరమైన సమస్తముకొరకు ఆయన సమకూర్పు పై ఆధారపడవచ్చు.

నా ప్రార్థన

దేవా, నీవు నాకోసం చేస్తున్న ఎన్నో అద్భుతమైన పనులు , నీవు నా జీవితంలో కుమ్మరించిన నీవు అందించే సమృద్ధిని చూడడానికి నాకు దృష్టిని ఇమ్ము .నా దృష్టి చిన్నది మరియు ఇరుకైనదని నేను అంగీకరిస్తున్నాను. నేను నీ కృప యొక్క విస్తృత దృశ్యాన్ని చూడాలి. అయినప్పటికీని నేను గుర్తించగల మీ ఆశీర్వాదాలలొని ఆ "కొంచెం" భాగమే ఎంతో విలాసవంతమైనది, దయతో నిండినది మరియు నెరవేరదగినవి . నేను చూడని ఇంకా అనేక విషయాలతో మీరు నన్ను ఆశీర్వదించారని నాకు తెలుసు. దాతృత్వము కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు ! యేసు నామములో ప్రార్ధించుచున్నాను ! ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు