ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

కొన్నిసార్లు అత్యంత లోతైన సత్యాలు చాలా సరళంగా ఉంటాయి. క్రీస్తును ప్రకటించుట కొరకు లోకములోనికి వెళ్ళటములో పరిశుద్దాత్మ ద్వారా దేవుని శక్తియును మరియు మనమెక్కడవున్నామో అక్కడినుండి మొదలుపెట్టి లోకమంతటికి వెళ్లుటను గూర్చిన దేవుని సంకల్పమును,దేవుడు మనకు ఏమి చేసాడో వాటిని ఇతరులకు చెప్పటానికైన సిద్దమనసునూ దాగియున్నాయి.

నా ప్రార్థన

సమస్త ప్రజలకు తండ్రీ, మమ్ములను మీ పరిశుద్దాత్మ తో నింపండి, విశ్వాసమును పంచుకొనటలో మరింత ప్రభావవంతముగా ఉండునట్లు చేయండి.మా పట్టణానికి ,మా దేశానికి మరియు మా ప్రపంచానికి మీ సువార్తను తీసుకువెళ్ళుటకు నన్ను చైతన్య￰ పరచండి.తండ్రీ క్రిందట జరిగిందే మరల ఇప్పుడును మా జీవితములలో మీరు చేయాలనుకొనుచున్నారని నేను ఇంకా నమ్ముచున్నాను.మీ నామము గొప్పదిగా చేసుకొనండి.సమస్త ప్రజల కన్నులలో మీ పరిశుద్దతను హెచ్చించుకొనండి.కృపా సువార్త సమస్త దేశములకు చేరాలనే మీ కోరికను సఫలీకృతం చేసుకొనుటకు నన్ను మరియు ఇతర ప్రజలను వాడుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్దించుచున్నాను ఆమేన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు