ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మీరు మన ఆధునిక ప్రపంచంలోని పెద్ద నగరాల గురించి ఆలోచించినప్పుడు, మీరు దేని గురించి ఆలోచిస్తారు? నేరాలు , ట్రాఫిక్, అధిక ధరలు, పెద్ద సమూహాలు, ధూళి మరియు శబ్దం? అంతేగా అయితే ,యేసు అలా వాటిని చూసినప్పుడు ఆ గొప్ప నగరాల్లో పాపములో తప్పిపోయిన ప్రజలు రక్షించబడాలని ఉద్రేకంతో తహతహలాడుతున్నాడు! ఒకవేళ మనం యేసు నొక్కిచెప్పని పక్షంలో, యెరూషలేము, సిరియాలోని అంతియోక్య, ఎఫెసస్ మరియు రోమ్ నుండి యేసు గురించిన సువార్త ఎలా వినిపించబడిందో చూపించడానికి లూకా అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని వ్రాసాడు. మన ప్రధాన నగరాల్లో నేరాలు మరియు సమస్యల గురించి ఆ భయంకరమైన నివేదికలు విన్నప్పుడు, అక్కడ నివసిస్తున్న వారి కోసం ప్రార్థిద్దాం. మనం పెద్ద నగరాల్లో నివసిస్తుంటే, పోలీసులు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు లేదా ఇతర అత్యవసర వాహనాల నుండి సైరన్‌లు వినబడినప్పుడు, మన నగరంలోని ప్రజల రక్షణ కొరకు కొంత సమయం కేటాయించి ప్రార్థిద్దాం!

నా ప్రార్థన

అతి పరిశుద్ధ మరియు ప్రేమగల దేవా , మీ కుమారుని సువార్త మరియు కృపతో ప్రపంచంలోని గొప్ప నగరాలలో పాపములో తప్పిపోయిన ప్రజలను చేరుకోవాలనే అభిరుచిని మాలోను, మీ సంఘములోను చైతన్య పరచండి. ప్రపంచంలోని ఏకైక నిజమైన ప్రభువు మరియు రక్షకుడైన యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు