ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

అయితే తరచూ మనం దేవుని గత క్రియలను పరిశీలిస్తాము మరియు మన పితరులయెడల జరిగిన మాదిరిగానే ఇప్పుడు ఆయన శక్తి ప్రదర్శించబడుట చూడలేమేమో అని అనుకుంటున్నాము. కానీ, దేవుడు తన ప్రజలలో ఒక నూతన తరము వారితో కలసి వెళ్లి తమ పితరులు కాలములో జరిగినట్లే వీరిని శక్తివంతం చేస్తాడని గుర్తుచేయబడినట్లే , క్రియలలో కూడా అతని శక్తి ద్వారా మనం అడగగలిగే లేదా ఊహించగల వాటన్నింటి ఎక్కువ చేయగలడని కూడా మనం ఆశించాలి! (cf. ఎఫెసీయులకు 3:20)

నా ప్రార్థన

బాహువు మరియు శక్తితో అనంతమైన పని చేయగల సర్వశక్తిమంతుడైన దేవా , మా తరంలో రక్షింపబడనివారు యేసుకు ప్రార్దించునట్లుగా మీ శక్తిని ఉపయోగించమని మేము కోరుతున్నాము. యుగములలో మీరు చేసిన విముక్తి, సమాధానము మరియు పునరుజ్జీవనం యొక్క గొప్ప పనిని మీరు చేసినట్లుగానే ఈ రోజుల్లో మేమును చేయునట్లు మమ్మును మీరు సాధనములుగా వాడుకొనండి.తండ్రీ, మేము మీ శక్తిని మరియు మీ కోరికను నమ్ముతున్నాము. దయచేసి మా తరాన్ని విమోచించడానికి శక్తివంతంగా వ్యవహరించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు