ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనము తుఫానుల మధ్య, భయాందోళన మధ్యలో ఉండగా, యేసు మన భయాన్ని, అవసరాన్ని గుర్తిస్తూ మన కోసం ఎదురుచూస్తూ, మనకు ఘోరమైన పీడకలలు వచ్చినప్పుడు మనతో ఉండి, మనకు సహాయము చేయడానికి ఎదురుచూస్తున్నాడు. మనకు చాలా సమీపముగా వెళ్లుచున్నాడు,ఇక్కడ యేసు చెప్పిన మాటలు అక్షరాలా నిజముగా ఉన్నాయి, "ధైర్యము తెచ్చుకో!నేనే. "దేవుడు నిర్గమకాండము 3వ అధ్యాయములో , ఇశ్రాయేలీయుల మొర విన్నాడని, వారి కష్టాలను చూశాడని, ఇప్పుడు వారికి సహాయము చేయడానికి దిగివచ్చాడని మోషేకు గుర్తుచేశాడు.యేసు మనకు అదే చేస్తాడు!

నా ప్రార్థన

దేవా, ఇక్కడ ఉండటమే కాదు, దగ్గరగా ఉండటం - ఎల్లప్పుడూ నా బాధ మరియు భయం యొక్క రోదనకు ప్రతిస్పందించడానికి వేచి ఉన్నందుకు ధన్యవాదాలు . నిన్ను మరియు ప్రభువైన యేసును ప్రతిరోజూ నా జీవితంలో మరింత ఆహ్వానించనందుకు నన్ను క్షమించు. మీరు దగ్గరలో ఉన్నారని నాకు తెలుసు, కాబట్టి మీరు మీ ఉనికిని నాకు తెలియజేయటమే మాత్రమే కాకుండా, నా దైనందిన జీవితపు అంచుకు నేను నిర్లక్ష్యముతో మిమ్మల్ని నెట్టివేసినప్పుడు మీరు నన్ను సున్నితంగా అదుపుచేస్తారని నేను అడుగుచున్నాను. యేసు పేరిట నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు