ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మనం జీవించే విధానం ద్వారా మన జీవితంలో మనము ఎవరి నియంత్రణలో ఉన్నామో చూపిస్తాం! మన ప్రపంచంలో తండ్రి స్వభావముతో జీవించడం ద్వారా తనతో వున్న మన సంబంధాన్ని చూపిస్తాము. కాబట్టి ఆత్మ యొక్క నియంత్రణలో జీవిద్దాం - ఆత్మ యొక్క ప్రేరేపిత వాక్యాన్ని పాటించడం మరియు ఆత్మ యొక్క నాయకత్వాన్ని అనుసరించడం - దానిద్వారా మనం చెప్పే మరియు చేసే పనులలో యేసును చూపించి, పంచుకోవచ్చు!

నా ప్రార్థన

ప్రియమైన తండ్రీ, దయచేసి యేసు అందం, దయ మరియు పవిత్రత నాలో కనబడటానికి సహాయం చెయ్యండి. ఈ రోజు మరియు ప్రతిరోజూ నేను చేసే పనులన్నిటిలో పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ, దయ మరియు ఫలాలను నా జీవితం చూపిస్తుంది. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు