ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

ప్రేమగల మరియు వినయపూర్వకమైన జీవనశైలి కలిగినవారి యొక్క స్వభావము నిజంగా వారు తెలివైనవారని చూపుతుంది . ప్రజలు అహంకారంతో వ్యవహరించడం చాలా సులభం, అయితే ప్రభువు దృష్టిలో వారు వెర్రివారి కంటే అధ్వాన్నంగా ఉన్నారు; వారు నిజముగా అజ్ఞానులు. జ్ఞానం అనగా జ్ఞానాన్ని చాటుకోవడం కాదు కానీ దైవిక జీవితాన్ని గడపడమే . యేసుతో మీ నడకలో ఏది మిమ్మల్ని ఆయనను పోలినట్లు చేస్తుంది అది — వినయపూర్వకమైన మరియు ప్రేమతో కూడిన జీవనశైలి ద్వారా వ్యక్తీకరించబడిన జ్ఞానమా లేదా ఆధిక్యత మరియు అహంకార భావాలతో తెలివైన మరియు ఇతరులకంటే హెచ్చించుకునే స్వభావమా ?

నా ప్రార్థన

ప్రేమగల కాపరి, మీరు నాకు తెలివైన మరియు ప్రేమగల తండ్రి అని నాకు తెలుసు. మీరు నాపై చూపిన సంరక్షణను ఈ రోజు అత్యంత అవసరమైన వ్యక్తితో పంచుకోవడానికి నాకు సహాయం చేయండి. దయచేసి అహంకారం మరియు ఆధిక్యత యొక్క భావాల నుండి నన్ను రక్షించండి మరియు మీ చేతుల్లో నన్ను మరింత ఉపయోగకరమైన సాధనంగా మార్చే మార్గాల్లో నన్ను సున్నితంగా తగ్గించండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు