ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

నీతికి శత్రువులుగా వున్నవారు కొంతకాలము వర్ధిల్లుతుండగా, నీతిమంతులపై దేవుడు అతని ప్రేమను కురిపిస్తాడు మరియు తన దయను చూపుతాడు. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని తన ప్రియమైన స్నేహితులకు గుర్తు చేసినట్లుగా, వారి ప్రార్ధనలు మరియు పరిశుద్ధాత్మ పని అతని విడుదలకు హామీ ఇచ్చాయి: అది యెమనగా వారికి సేవ చేయడానికి జైలు నుండి మరియు మరణం నుండి విముక్తి పొందడమా , లేదా అతను తండ్రితో కూడా ఉండటానికి మరణం ద్వారా జైలు నుండి విడుదల పొందడమా. (ఫిలిప్పి 3: 19-21). రెంటిలో ఏది జరిగినా , దేవుని నీతిమంతులకు ఒక విందు, గౌరవప్రదమైన ప్రదేశం మరియు రాజ ఆహ్వానము లభిస్తుంది, అది వారిని వ్యతిరేకించే వారి ముందు వారి విశ్వాసాన్ని నిరూపిస్తుంది.

నా ప్రార్థన

తండ్రీ, యుగములకు రాజా , మీరు నా గౌరవార్థం విందును నిర్వహిస్తారని మరియు నన్ను మీ రాజకుమారులలో ఒకరిగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానానికి ధన్యవాదాలు. అంతిమముగా మీరు ఇచ్చే విడుదలను గూర్చి ఇచ్చిన హామీకై ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు దయతో నా జీవితాన్ని ఉప్పొంగింపచేసినందుకు ధన్యవాదాలు. యేసు నామంలో నేను నిన్ను స్తుతిస్తాను! ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు