ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

భయానక మరియు విపత్తు సమయాల్లో, ప్రజలు మామూలుగా "వీటన్నిటిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు" అని అడుగుతారు. అయినప్పటికీ మనం తరచూ మన జీవితాల అంచున దేవుణ్ణి విడిచిపెట్టి, మనం నిరాశకు గురైనప్పుడు మరియు ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే ఆయన కోసం వెతుకుతాము. పరిస్థితులు￰ సరిగ్గా జరుగుతున్నప్పుడు, "ఈ అన్నిటిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? అని అరుదుగా అడుగుతాము .ఎందుకు, అతను ఇక్కడే మనలను ఆశీర్వదిస్తున్నాడు! అతని మంచితనం కోసం ఆయనను స్తుతిద్దాం!" మంచి సమయాల్లో, చెడు సమయాల్లో తనను ఆశ్రయించి, అతనిని వెతకాలని దేవుడు మనలను వేడుకుంటున్నాడు. మనము అతనిని కనుగొనటము కాదు ; అతనే మన వద్దకు తిరిగి వచ్చి మనతో నడుస్తాడు.

నా ప్రార్థన

దేవా, దయచేసి మా స్వంత మార్గాన్ని కోరినందుకు మమ్మల్ని క్షమించు. మేము మీ మార్గాల నుండి దూరముగా తిరుగుతున్నామని మేము అంగీకరిస్తున్నాము. బైబిల్ మనకు సులువుగా అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు వాక్యము ద్వారా మాట్లాడటం వినే అవకాశాన్ని మేము తరచుగా నాశనం చేసుకుంటున్నాము . నిన్ను స్తుతించటానికి మరియు మిమ్మల్ని ప్రార్థించడానికి మాకు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ, మేము అధిగమించలేని సమస్యలలో చిక్కుకున్నప్పుడు మీరు ఆ కొన్నిసార్లు మాత్రమే మా నుండి వింటారు. తండ్రీ, నేను మీతో నా సంబంధాన్ని జారవిడుచుకున్నాను మరియు నేను నా జీవితంలో మీ ఉనికిని నేను చేయగలిగినంత వరకు కొనసాగించలేదని అంగీకరిస్తున్నాను. మా జీవితంలో ప్రతిరోజూ నిన్ను మరియు మీ ఉనికిని కోరుకునేటప్పుడు దయచేసి నాతో మరియు మీ సంఘము అంతా ఉండండి! యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు