ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

మన ఆశీర్వాదాలను పరిశీలిస్తున్నప్పుడు మరియు దేవుని అద్భుతమైన కృపకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు, దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదించాడో ప్రశ్నించుకుందాము . నేటి గ్రంథంలో దేవుడు స్పష్టం చేసిన ప్రాధమిక ఆధ్యాత్మిక సూత్రాన్ని కూడా గుర్తుంచుకుందాం మరియు ఆదికాండము 12: 2 లోని అబ్రాహాముకు ఆయన పిలిచిన పిలుపులో కూడా: మనము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండటానికి దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తారు అని మనం కేవలము దేవుని ఆశీర్వాదాలను స్వీకరించేవాళ్ళం కాదని నిర్ధారించుకుందాం. ఇతరులకు ఆ ఆశీర్వాదాలకు మనము మార్గముగా ఉండటానికి కట్టుబడి ఉందాము.

నా ప్రార్థన

ఉదార స్వభము గల తండ్రీ, మీ చాలా విలాసవంతమైన బహుమతులు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా చుట్టూ ఉన్నవారికి ఆ ఆశీర్వాదాలు ఎలా పంచగలనో తెలుసుకోవడానికి నాకు కళ్ళు తెరవండి. మీరు నాకు ఎంతో గొప్పగా ఇచ్చిన ఆశీర్వాదాలను నేను పంచుకున్నప్పుడు, ఇతరులు వారి గొప్ప ఆశీర్వాదం - మీ ప్రేమపూర్వక దయను కనుగొని, మీకు కృతజ్ఞతలు తెలియజేయుదురుగాక ! యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు